కల్యాణ్ సింగ్ కండిషన్ సీరియస్

కల్యాణ్ సింగ్ కండిషన్ సీరియస్

లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చెప్పింది. ‘‘ఇంతకుముందు లాగానే కల్యాణ్ సింగ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఎప్పటికప్పుడు ఎక్స్ పర్ట్స్ మానిటర్ చేస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచాం” అని హాస్పిటల్ మంగళవారం ప్రకటనలో పేర్కొంది. కాగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆస్పత్రికి వచ్చి, కల్యాణ్ సింగ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రాజస్థాన్ గవర్నర్​గా కూడా పనిచేసిన కల్యాణ్ సింగ్ .. అనారోగ్యంతో ఈ నెల 4న ఆస్పత్రిలో అడ్మిట్