మారిన బీఈడీ ఎంట్రెన్స్ అడ్మిషన్ నిబంధనలు

మారిన బీఈడీ ఎంట్రెన్స్ అడ్మిషన్ నిబంధనలు

    బీసీఏ, బీబీఏ చదివినా ఇంటర్​సబ్జెక్ట్స్​ప్రకారం అడ్మిషన్స్
    బీఈడీ కోర్సు రూల్స్–2017కు రాష్ట్ర సర్కారు సవరణలు

ఇప్పటి వరకు డిగ్రీలో చదివిన కోర్సులు, అందులోని సబ్జెక్టుల ఆధారంగానే ఇస్తున్న బీఈడీ అడ్మిషన్స్‌‌లో సర్కారు మార్పులు చేసింది. ఇకపై డిగ్రీలో చదవని సబ్జెక్టుల్లో కూడా ఎంట్రెన్స్ పొందవచ్చు. రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్‌‌‌‌లో చదివిన సబ్జెక్ట్స్​ఆధారంగా అడ్మిషన్స్​ఇచ్చేలా కొత్త రూల్స్‌‌ను 2021–22 అకడమిక్ ఇయర్ నుంచే అమలు చేసేందుకు సిద్ధమైంది. డిగ్రీలో ఏ గ్రూప్ చదివినా 50 శాతం మార్కులతో పాస్ అయితే బీఈడీ ఎంట్రెన్స్​ రాసేందుకు అర్హులుగా నిర్ణయించింది. ఇంజనీరింగ్‌‌ చదివిన వారికి అర్హతను 55 శాతం నుంచి 50 శాతానికి  తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్, డిగ్రీలో చదివిన గ్రూపులు, ఎడ్​సెట్‌‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీఈడీలో ఆయా మెథడాలజీల్లో సీటు పొందవచ్చు. ఈ మేరకు  నేషనల్ టీచర్ ఎడ్యు కేషన్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఉన్నత విద్యా మండలి చేసిన సిపార్సులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం బీఈడీ అడ్మిషన్స్, ఎంట్రెన్స్ టెస్ట్ (ఎడ్​సెట్) ​విధానంలో మార్పులు చేసింది. ఇందుకు బీఈడీ కోర్సు రూల్స్–2017కు సవరణలు చేసింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్​స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్​ ఇటీవల ఉత్తర్వులిచ్చారు.  

డిగ్రీలో కెమిస్ట్రీ మాత్రమే ​చదివినా ఫిజిక్స్​మెథడాలజీ..

డిగ్రీలో బీసీఏ చేసిన వారికి ఇంటర్‌‌‌‌లో చదివిన సబ్జెక్టుల ఆధారంగా సంబంధిత మెథడాలజీలో చేరేందుకు కొత్త రూల్స్‌‌ అవకాశం కల్పిస్తున్నాయి. అలాగే బీబీఏ చేసిన వాళ్లూ బీఈడీ సోషల్‌‌ స్టడీస్‌‌ మెథడాలజీలో ప్రవేశాలు పొందేలా మార్పులు చేశారు. అలాగే డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్​ఒక్కటే చదివినా ఫిజిక్స్ మెథడాలజీలో బీఈడీ అడ్మిషన్​ తీసుకోవచ్చు. ఇంతకు ముందు ఫిజిక్స్‌‌, కెమిస్ట్రీ కాంబినేషన్‌‌తో డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉండేది. అయితే ఫిజిక్స్‌‌ లేకుండా పలు కాంబినేషన్లతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి వచ్చినందున ఇంటర్‌‌‌‌ సబ్జెక్టుల ఆధారంగా బీఈడీ సీటు పొందేలా రూల్స్ మార్చారు. బీఎస్సీ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్‌‌ అప్లికేషన్స్‌‌, బీఎస్సీ బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తదితర 46 కోర్సుల విద్యార్థులు కూడా బీఈడీలో ఫిజిక్స్‌‌ తీసుకోవచ్చు. ఇకపై అన్ని గ్రూప్స్‌‌ వారికీ కామన్‌‌​ఎంట్రెన్స్​టెస్ట్​ నిర్వహించేలా ప్రభుత్వం రూల్స్ మార్చింది. వచ్చే అకడమిక్ ఇయర్ అడ్మిషన్స్‌‌కు సంబంధించి ఎడ్ సెట్‌‌ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఒకటి రెండ్రోజుల్లో ఎడ్‌‌ సెట్‌‌ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవనుంది. ఆగస్టు 24,25 తేదీల్లో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించాలని ఇప్పటికే ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

కాలేజీల్లో మెథడాలజీ వారీగా సీట్లపై క్లారిటీ
బీఈడీ కాలేజీల్లో ఏ మెథడాలజీకి ఎంత శాతం సీట్లు అనే దానిపై  ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మ్యాథమాటిక్స్‌‌కు 25%, బయాలాజీ, ఫిజిక్స్‌‌ కలిపి 30 శాతం, సోషల్, ఇంగ్లిష్, ఓరియంటల్ లాంగ్వేజ్‌‌లకు కలిపి 45 శాతం సీట్లను కేటాయించింది. ఇందులో 5 శాతం చొప్పున ఇంగ్లిష్, ఓరియంటల్​లాంగ్వేజ్‌‌లకు ఉండాలని స్పష్టం చేసింది. అదే సమయంలో రెండు కలిపి 15 శాతం మించకూడదు.​