బాకీ కింద భార్య పుస్తెలు లాక్కెళ్లిన్రు..భర్త సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

బాకీ కింద భార్య పుస్తెలు లాక్కెళ్లిన్రు..భర్త సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో దారుణం
  • న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట బంధువుల ఆందోళన

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో దారుణం జరిగింది. బాకీ పైసల కోసం ఇద్దరు వ్యక్తులు పొద్దున్నే ఇంటికొచ్చి గొడవ చేశారు. ఇంట్లోకి చొరబడి భార్య మెడలో పుస్తెల తాడును గుంజుకపోయారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో అవమానంగా భావించిన భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1.20 లక్షల కోసం..నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన నవాతే నాగరాజు (33) స్థానిక గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అడ్తి దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. యజమానితో సంబంధం లేకుండా గుమస్తాలు వడ్లు కొని మారు వ్యాపారం కూడా చేస్తుంటారు. ఈ క్రమంలో తనకు దూరపు బంధువైన కమ్మర్ పల్లి మండలం కొనసముందర్ గ్రామానికి చెందిన బాదం శ్రీనివాస్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో నాగరాజు వడ్లు కొన్నాడు. 

ఇందుకు రూ. 3 లక్షల 20 వేలను శ్రీనివాస్‌‌కు చెల్లించాల్సి ఉండగా రూ.2 లక్షలు కట్టాడు. మార్చిలో లాక్‌‌డౌన్ వల్ల ఉపాధి లేక రూ. లక్షా 20 వేలు ఇన్ టైంలో చెల్లించలేకపోయాడు. దీంతో ఈ మొత్తాన్ని బాకీ కింద జమకట్టిన శ్రీనివాస్.. కొంతకాలంగా నాగరాజుపై ఒత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలో బాకీ వసూలు కోసం బుధవారం పొద్దున 6 గంటలకు తన స్నేహితుడు లక్ష్మీనారాయణను వెంటేసుకొని నాగరాజు ఇంటికి శ్రీనివాస్‌‌ వెళ్లాడు. వెంటనే డబ్బులు చెల్లించాలని గొడవ చేశాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోకి చొరబడి నాగరాజు భార్య అఖిల మెడలోంచి పుస్తెల తాడు లాక్కెళ్లాడు. దీంతో తన పరువు పోయిందని మనస్తాపం చెందిన నాగరాజు బెడ్రూంలో ఉరేసుకున్నాడు. ఎంతసేపైనా అతను తలుపు తీయకపోవడంతో పగలగొట్టి చూడగా నాగరాజు విగతజీవిగా కనిపించాడు. 
కొన్ని రోజుల కింద బైక్‌‌ లాక్కొని.. కొట్టి
నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ త్రీ టౌన్‌‌ పోలీస్ స్టేషన్‌‌ ఎదుట నాగరాజు కుటుంబీకులు, బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. బాకీ వసూలుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ వెనుక మంత్రి ప్రశాంత్‌‌రెడ్డి ఉన్నాడని.. ఏం చేసుకుంటారో చేసుకోమని బెదిరించారని మృతుడి బంధువులు ఆరోపించారు. కొన్ని రోజుల కింద బాకీ పైసల కోసం నాగరాజు బైక్‌‌ను కూడా లాక్కొని చితకబాదారన్నారు. నాగరాజుకు కూతురు ఆరాధ్య (7), కొడుకు సిద్ధాంత్ (4) ఉన్నారు. నాగరాజు భార్య అఖిల ఫిర్యాదుతో శ్రీనివాస్‌‌, లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోశ్ కుమార్ తెలిపారు.