ఆగస్టు 14న TSRJC CET ప్రవేశపరీక్ష

ఆగస్టు 14న TSRJC CET ప్రవేశపరీక్ష

గురుకుల జూనియర్ కాలేజీలు (TSRJC) సెట్‌ను ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్‌ తెలిపారు. రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ MPC,BPC,MEC ఇంగ్గిష్ మీడియం ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం TSRJC సెట్‌ను నిర్వహిస్తారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 14న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.