
- కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెస్తామని, దేశంలోని క్రీడా టాలెంట్ ను బయటకు తీస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులే దేశానికి పతకాలు సాధిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాధించాలన్న పట్టుదలే వారిని మెడల్స్ తెచ్చేలా ప్రోత్సాహం కల్పిస్తోందని వివరించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి క్రీడాకారులను గుర్తించి వారిలోని ప్రతిభను సానబెట్టి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చి దిద్దే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.