38మంది భార్యల ముద్దుల భర్త ఇకలేరు

38మంది భార్యల ముద్దుల భర్త ఇకలేరు
  • ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్ద జియోనా చానా(76)
  • మొత్తం 89 మంది పిల్లలు
  • కోడళ్లు, మనవలు, మనవరాళ్లు 33 మంది
  • భార్యా, పిల్లలు, కోడళ్లు, మనవళ్లతో కలిపి మొత్తం 160 మంది
  • భార్యా పిల్లలందరూ కలసి 4 అతస్తులు, 100 గదుల భవంతిలో నివాసం
  • సంతాపం తెలుపుతూ జియోనా కుటుంబం పోటోతో ట్వీట్ చేసిన మిజోరం సీఎం జోరమ్ తంగ్

ఐజ్వాల్: 38 మంది భార్యల ముద్దుల భర్త జియానా చానా కన్ను మూశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్న జియోనా చానా 76ఏళ్లు. ఈయనకు మొత్తం 89 మంది పిల్లలు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు 33 మంది ఉన్నారు. భార్యా, పిల్లలు, కోడళ్లు, మనవళ్లతో కలిపి మొత్తం కుటుంబం 160 మంది. జియానా భార్యా పిల్లలందరూ కలసి 4 అంతస్తులు, 100 గదుల భవంతిలో నివాసం ఉంటున్నారు. మిజోరాం రాష్ట్రానికే గుర్తింపు తెచ్చిన ఈ భవంతికి ‘‘చుహాన్ తార్ రన్’’ అని పేరు పెట్టుకున్నారు. జియానా కారణంగా బక్తాంగ్ గ్రామం మిజోరంకు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. చానా సామాజిక వర్గానికి చెందిన జియోనా 1945లో జులై 21న జన్మించారు. 17 ఏళ్ల వయసులో తన కంటే మూడేళ్లు పెద్ద అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నుంచి వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్తున్నాడు. భార్యలందరితో కలసి ‘‘చుహాన్ తార్ రన్’’ లోనే నివాసం. తన పడక గదిని ఆనుకుని ఉన్న డార్మెటరీ ల్లాంటి గదుల్లో భార్యలు ఉంటారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు వేరే గదుల్లో ఉంటారు. అయితే మొత్తం 160 మందికి ఒకే వంట గది. అందరికి కలిపి వంట చేస్తారు. అందరూ కలసి భోజనం చేస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతుండడంతో పర్యాటకులు ఇచ్చిన ఆర్ధిక సహాయంతో కుటుంబం నెగ్గుకు వస్తోంది. జియానా మరణ వార్తపై మిజోరం ముఖ్యమంత్రి జోరమ్ తంగ్ స్పందించి జియానా కుటుంబం ఫోటోతో ట్వీట్ చేశారు.  ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబ పెద్ద జియానా చానా ఇక లేరంటూ ధృవీకరించారు. మిజోరాం లోని బక్తాంగ్ త్లాంగ్నుమ్ గ్రామం అతని కుటుంబం కారణంగా మిజోరాం రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణగా మారిందని పేర్కొన్న ఆయన రెస్ట్ ఇన్ పీస్ సర్ అంటూ జియోనాకు నివాళులర్పించారు.