1 నుంచి తెలంగాణలో పోషణ అభియాన్

శిశువుల ఆరోగ్యం కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. తల్లి గర్భంలో ఉండగానే బిడ్డకు సరైన పోషకాలు అందించేలా చర్యలు చేపట్టింది. పోషణ అభియాన్ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ .

జనవరి 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ అర్బన్ జిల్లాలో అమలు పరిచేందుకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తున్న కేంద్రం, త్వరలో తెలంగాణలో మరో 20 జిల్లాల్లో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ రిక్వెస్ట్ తో మిగిలిన 11 జిల్లాల్లోనూ త్వరలో ఈ పథకం అమలుకానున్నట్లు తెలిపింది కేంద్రం.

సంపూర్ణ ఆరోగ్యంతో శిశువు జన్మించేందుకు స్త్రీ, శిశు సంక్షేమశాఖతోపాటు ఇతర ప్రభుత్వశాఖలు ఈ పథకం అమలులో బాధ్యతలు నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేసింది. తల్లికి బిడ్డ ఆరోగ్య పెరుగుదలకు అవసరమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖకు అప్పగించినట్లు తెలిపింది కేంద్రం.

 

Posted in Uncategorized

Latest Updates