1.10 లక్షల పోస్టులు ఖాళీ

TELANGANA LOGOరాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం.  దాని ప్రకారం 83,048 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా ఇప్పటికే 52,724 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది ప్రభుత్వం. అందులో 28,116 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యధికంగా హోం శాఖలో 36,785 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 30,666 పోస్టుల భర్తీకి అనుమతి లభించగా 12,152 పోస్టులు భర్తీ అయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖలో 12,487 ఖాళీలు ఉండగా, పాఠశాల విద్యాశాఖ 9,980 ఖాళీలతో మూడో స్థానంలో నిలిచింది. సింగరేణిలో 7,266 ఖాళీలు ఉండగా అన్నింటినీ భర్తీ చేశారు. ఉన్నత విద్యలో 4,702, రెవెన్యూ శాఖలో 4,253, వ్యవసాయ శాఖలో 3,673 ఖాళీలు ఉన్నాయి.

పశుసంవర్ధక శాఖలో 1,842, బీసీ సంక్షేమంలో 2,881, అటవీ శాఖలో 3,602, విద్యుత్ శాఖలో 2,698, గిరిజన సంక్షేమంలో 3,556, పురపాలక,పట్టణాభివృద్ధి శాఖలో 2,612, మైనార్టీ సంక్షేమంలో 2,278, పంచాయతీరాజ్ శాఖలో 1,620, ఆర్ అండ్ బీలో 1,249 ఖాళీలు ఉన్నాయి. నీటి పారుదల శాఖలో 853, ఆర్థిక శాఖలో729, కార్మికశాఖలో 724, ప్రణాళికశాఖలో 514, స్త్రీ, శిశు సంక్షేమంలో 308 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates