1.2 కోట్ల జీతం : ఎంటెక్ స్టూడెంట్ కి గూగుల్ బంఫరాఫర్

ఎంటెక్‌ చదువుతున్న ఆదిత్య పలివాల్‌ (22) అనే విద్యార్థికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది గూగుల్ సంస్థ. ఏడాదికి రూ.1.2 కోట్ల వేతన ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తున్నట్లు  లేఖను పంపింది. ముంబయికి చెందిన ఆదిత్య బెంగళూరులో విద్యాభ్యాసం చేస్తూనే గూగుల్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కంప్యూటర్‌ భాష కోడింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. వివిధ దేశాలకు చెందిన ఆరు వేల మంది పరీక్ష రాయగా, 50మంది ఫైనల్ రౌండ్ కి చేరుకున్నారు. వారికి కృత్రిమ మేధస్సు, టెక్నాలజీ రీసెర్చ్  అంశాలపై మరోసారి టెస్ట్ నిర్వహించగా… ఆదిత్య మొదటిస్థానంలో నిలిచారు. జూలై 16 నుంచి ఉద్యోగానికి హాజరవుతానని తెలిపారు ఆదిత్య.

Posted in Uncategorized

Latest Updates