మాతృ భాషకు మెదడులో 1.5MB చాలు

స్థానిక భాషలో పట్టు సాధించాలంటే మెదడులో 1.5 ఎంబీ స్టోరేజీ చాలట, అది ఫ్లాపీడిస్క్ సైజ్ లేదా ఒక నిమిషం ఎంపీ3 పాటతో సమానమని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. చిన్నతనంలో బ్రెయిన్ కేవలం కొన్ని రకాల శబ్దాలను మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత అక్షరాలు, పదాలు పలుకుతాం. ఎదిగే కొద్దీ పదాల అర్థాలు తెలుసుకుంటాం . పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వరకు భాష నేర్చు కోవటం అంత సులువేమీ కాదని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా ఇంగ్లిష్ మాట్లాడే యువకుడికి భాషకు సంబంధించి 12.5 మిలియన్ బిట్స్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందని రాయల్ ఓపెన్ సొసైటీ జర్నల్ లో పబ్లిష్ చేసిన రిపోర్ట్ లో పేర్కొన్నారు. బిట్స్ అంటే కంప్యూటర్ తరహాలో 0, 1 ఫార్మాట్ లో సమాచారాన్ని స్టోర్ చేయడం. మన మెదడు సమాచారాన్ని డిఫరెంట్ ఫార్మాట్ లో ఎన్ కోడ్ చేస్తుంది. దాన్ని పోల్చి చూసుకునేందుకు బిట్స్ ను వాడుకోవచ్చు. ఒక రోజులో యువకుడు స్థా నిక భాషలో వెయ్యి నుంచి రెండు వేల బిట్స్ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. చాలా తక్కువ అనుకున్నా రోజుకు 120 బిట్స్ సమాచారం గుర్తు పెట్టుకోవచ్చని చెబుతున్నా. భాషకు సంబంధించి 12.5 మిలియన్ బిట్స్ సమాచారాన్ని బ్రెయిన్ స్టోర్ చేసుకోగలదని సైంటిస్టులు చెబుతున్నా రు. వాక్య నిర్మాణం అనేది భాషలో చాలా చిన్న అంశమని, పదాల అర్థా లు తెలుసుకోవడం చాలా కఠినమని తమ రీసెర్చ్ లో తేలినట్లు రిపోర్ట్ లో చెప్ పారు. రోబోలు,మనుషులు నేర్చు కోవడానికి ఇదే ముఖ్యమైన వ్యత్యా సమన్నా రు. పదాలు, వాక్యాలు మెషిన్లకు బాగా తెలుస్తాయి. అయితే వాటి అర్థా లకు సంబంధించి వాటికి అంతగా తెలియదని తమ స్టడీలో వెల్లడైనట్లు చెప్ పారు. రెండు భాషలు మాట్లాడేవారు ఎక్కువ బిట్స్ సమాచారం బ్రెయిన్ లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 

Latest Updates