సెక్యూరిటీ ఫోర్సెస్ ఎన్‌కౌంటర్‌‌లో ఒక టెర్రరిస్టు హతం

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌‌, శ్రీనగర్‌‌ సిటీలోని జదిబాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఓ టెర్రరిస్టును సెక్యూరిటీ ఫోర్సెస్‌ మట్టు పెట్టాయి. అలాగే మరో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శ్రీనగర్ సిటీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని తెలిసింది. జదిబాల్, పోజ్వలాపూర్‌‌ ప్రాంతాల్లో సెక్యూరిటీ ఫోర్సెస్ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో టెర్రరిస్టులు వారిపై కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ మొదలైందని అధికారులు తెలిపారు. టెర్రరిస్టుల పేరెంట్స్‌ను సదరు ఎన్‌కౌంటర్ జరుగుతున్న ఏరియాకు తీసుకొచ్చినప్పటికీ.. లొంగిపోవడానికి వారు ఒప్పుకోలేదని కాశ్మీర్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ చెప్పారు. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు 2019 నుంచి టెర్రరిస్టు ఆపరేషన్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారని.. మరొకరికి గత నెలలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌పై జరిగిన దాడిలో ప్రమేయం ఉందన్నారు.

Latest Updates