10లక్షలు దొరికాయి : ACB వలలో ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐ

ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐ దాసరి భూమయ్య ఏసీబీకి చిక్కాడు. రాజేంద్ర నగర్ లో ఓ భూమి కొనుగోలుకు వెళ్తుండగా భూమయ్యను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తన దగ్గరున్న 10 లక్షల నగదుపై విచారించగా తనకేం తెలియదంటూ బుకాయించాడు భూమయ్య. కొంత కాలంగా భూమయ్యపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు నిఘా కూడా పెట్టారు. ఏసీబీకి కంప్లయింట్స్ కూడా వెళ్లాయి. వీటి ఆధారంగా ఏసీబీ టీం ఫాలో అవుతూ వచ్చింది.

జూలై 19వ తేదీ శుక్రవారం ఆదిలాబాద్, కరీంనగర్ లోని భూమయ్య ఆఫీసులు, ఇళ్లలో ఏక కాలంలో సోదాలు చేసింది ఏసీబీ. హైదరాబాద్ రాజేందర్ నగర్ లో భూమి కొనుగోలుకు రూ.10లక్షల డబ్బుతో వెళ్లిన భూమయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 10లక్షలకు లెక్క చెప్పకపోవటంతో ఆ నగదును సీజ్ చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్ లోని తనిఖీల్లో ఎన్ని ఆస్తులు బయటపడ్డాయి.. ఎంత నగదు గుర్తించారు అనే వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates