10వ తరగతి చాలు : ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

airకన్నూరు ఎయిర్ పోర్టులో వివిధ కేటగిరీల్లో 518 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(AIATSL). సంబంధిత పోస్టులు, విభాగాలను బట్టి వాటికి విద్యార్హతలను పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, ఎంబీఏ లుగా నిర్ణయించారు. మే 4 నుంచి 7 వరకూ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ ఎస్ ఎన్ పార్క్ రోడ్డులోని హోటల్ బ్లూనైల్ లో పోస్టుల ఆధారంగా వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

అప్లికేషన్ ఫీజును రూ.500 గా నిర్ణయించారు. అయితే SC, ST, మాజీ సైనికోద్యోగ కూటగిరీలకు మాత్రం అప్లికేషన్ ఫీజు లేదు. సంబంధిత వివరాల కోసం www.airindia.in  వెబ్ సైట్ ను సందర్శంచవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. అన్నీ పోస్టులకు ప్రి-ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరి అని తెలిపింది. టెర్మినల్ మేనేజర్(TM), అసిస్టెంట్ టెర్మినల్ మేనేజర్(ATM) పోస్టులకు మాత్రం ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదని తెలిపింది. మిగిలిన పోస్టులకు 28 ఏళ్లకు మించకూడదని, రిజర్వేషన్లు వర్తిస్తాయని ఎయిర్ ఇండియా తెలిపింది. పోస్టును బట్టి స్క్రీనింగ్, లిటరసీ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ట్రేడ్ టెస్ట్ ల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరగనుంది. పోస్టుల ఆధారంగా రూ.13,400 నుంచి రూ.55,000 వరకూ ఉంటుందని ఎయిర్ ఇండియా తెలిపింది.

 

 

Posted in Uncategorized

Latest Updates