10వ తరగతి పాసైతే చాలు : 54 వేల 953 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త.  కేంద్రసాయుధ దళాల లోని 54,953 కానిస్టేబుల్, రైఫిల్ మన్ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమీషన్(SSC). బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 16,984, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో 21,566, సశస్త్ర సీమబుల్ లో 8,546, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ లో 4,126, అస్సాం రైఫిల్స్ లో 3,076, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లో 8, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ లో 447 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 200 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు-20 లోపు ఆన్ లైన్ ధరఖాస్తు చేసుకోవాలి. 10వ తరగతి పాసైన వాళ్లు కూడా ఈ పోస్టులకు అప్లయి చేసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల లోపు అరహులైన అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లయి చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక విధానముంటుంది.  ప్రతి విభాగంలో కూడా మహిళలకు కొన్ని పోస్టులను కేటాయించారు.

 

Posted in Uncategorized

Latest Updates