10 వేలకు అటల్ పింఛన్ పెంపు

ATAL PENCHHANఅత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అటల్‌ పింఛను యోజన(ఏపీవై)లో కీలక మార్పులు చేయాలని యోచిస్తోంది మోడీ సర్కారు. ఈ పథకం ద్వారా ప్రతి నెలా ఇచ్చే పింఛను పరిమితిని రూ.5 వేలనుంచి 10 వేలకు పెంచాలని భావిస్తోంది పింఛను నిధి నియంత్రణ అభివృద్ధి సంస్థ(PF RDA). ఈ మేరకు సర్కారుకు పలు కీలక ప్రతిపాదనలు పంపింది PFRDA.  ప్రస్తుతం ఏపీవై పథకంలో చేరాలంటే లబ్ధిదారుడు తన పేర నమోదు చేసుకోవాలి. ఇకపై నమోదు అవసరం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నేరుగా ఈ పథకానికి అర్హుడయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ప్రస్తుత నిబంధన ప్రకారం 18-40 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు మాత్రమే ఈ పథకానికి అర్హులు… కానీ ఇకపై ఈ పరిమితిని 50 ఏళ్లవరకు పెంచాలని సూచన చేసింది. ఏపీవై లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకే ఈ ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు PF RDA చైర్మన్‌ హేమంత్‌ జీ కాంట్రాక్టర్‌. 30 ఏళ్ల తర్వాత 60ఏళ్ల వయస్సులో రూ 5000 సరిపోదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతోనే పింఛను పరిమితిని పెంచినట్లు తెలిపారు ఆయన. ప్రస్తుతం ఏపీవై పథకంలో 1.02 కోట్లమంది లబ్ధిదారులున్నారు.

Posted in Uncategorized

Latest Updates