10 వేల పోస్టుల వెల్లడికి TSPSC కసరత్తు

indexరెండు నెలల్లో 10 వేల పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడించడానికి కసరత్తు చేస్తుంది TSPSC. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫలితాల వెల్లడికి వేగం పెంచింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పదిరోజుల్లో 3 వేల పోస్టులకు ఫలితాల వెల్లడించడంతోపాటు, ఉపాధ్యాయ నియామక పరీక్ష(TRT) ‘కీ’లు కూడా ప్రకటించనుంది TSPSC. గత 15 రోజుల్లోనే PGT, TGT ఫలితాలు వెల్లడయ్యాయి. భాషా పండితులకు సంబంధించిన రెండు వేల ఖాళీలకు వారం రోజుల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. అలాగే వ్యవసాయ శాఖలో ఉన్న ఖాళీల ఫలితాలు రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో సివిల్ ఇంజనీరింగ్ పోస్టులపై న్యాయశాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. స్పష్టత వచ్చిన తరువాత ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించింది TSPSC. అలాగే వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు సైతం న్యాయ వివాదాల్లో కూరుకపోయాయి. అటవీ శాఖకు సంబంధించిన పోస్టుల ఫలితాలు త్వరలో ప్రకటించనుంది తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్. పోలీసు కానిసటేబుల్ ఉద్యోగాల అర్హతల్లో సంస్కరణలు అమలవుతున్నాయి. కానీ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు పాత నిబంధనలే పెట్టారు. దీనితో కొన్ని చోట్ల సరైన అభ్యర్థులే కరువయ్యారు.

Posted in Uncategorized

Latest Updates