వరద బాధితుల కోసం హెటిరో డ్రగ్స్ 10 కోట్ల విరాళం

హైదరాబాద్: వరద బాధితులను ఆదుకునేందుకు హెటిరో డ్రగ్స్ రూ.10 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాల కోసం తమ వంతు సాయంగా హెటిరో డ్రగ్స్ 10 కోట్ల రూపాయల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసింది. వరదల వల్ల ఎక్కువగా నష్టపోయిన పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందించి ఈ సహాయం అందిస్తున్నట్లు హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థ సారధి రెడ్డి వెల్లడించారు.

 

Latest Updates