వృద్ధురాలిని చంపేసి 10 తులాల బంగారం చోరీ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహిపట్నం మండలం కందుకూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో  ఒంటిరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు బాలామణిని గొంతు నుమిలి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె ఒంటిపై  ఉన్న 10 తులాల బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. ఇంట్లో హత్య చేసిన దుండగలు.. వృద్ధురాలు మృతదేహన్ని ఇంటి సమీపంలో పడేశారు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఇబ్రహీంపట్నం ఏసిపి టీమ్ ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తోంది. అంతరాష్ట్ర ముఠా పనా….లేక  తెలిసిన వారే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో దొంగల బెడద ఎక్కువైందని… పోలీసులు గస్తీ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.

బెల్లంపల్లిలో పోలీసుల దురుసు ప్రవర్తన

see also: భార్య కంటే అవే ప్రాణమట..!

కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ కాలేదు

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

 ఐపీఎల్ మ్యాచులు.. టైం తెలుసా..?

Latest Updates