కాబూల్‌ లో పేలుడు..10 మంది మృతి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం ఆ దేశ ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా స‌లేహ్‌ కాన్వాయ్ ని టార్గెట్ చేస్తూ బాంబు దాడికి ప్ర‌య‌త్నించారు. ఈ దాడిలో సుమారు 10 మంది మృతిచెందగా…మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ‌తంలో అఫ్గా‌న్ ఇంటెలిజెన్స్ స‌ర్వీసులో ప‌నిచేసిన స‌లేహ్‌కు పేలుడుతో స్వ‌ల్ప గాయాల‌య్యాయి. పేలుడు ఘ‌ట‌న త‌ర్వాత భారీ స్థాయిలో పొగు క‌మ్ముకుంది. అఫ్గా‌న్ అధికారులు, తాలిబ‌న్ మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న ఈ సమయంలో బాంబు దాడి జరిగింది. తాలిబ‌న్‌ను వ్య‌తిరేకిస్తున్న వారిలో స‌లేహ్ ఒక‌రు. అయితే ఈ దాడికి తాము కార‌ణం కాదంటూ మిలిటెంట్ సంస్థ ప్ర‌క‌టించింది. స‌లేహ్‌పై జ‌రిగిన బాంబు దాడి ఘ‌ట‌న‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది.

Latest Updates