ఎమ్మెల్యే ఆఫీస్ లో దొంగతనం.. రూ.10లక్షలు మాయం

ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆఫీస్ లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో పది లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు తెలిపారు. పలు సంక్షేమ కార్యక్రమాల కోసం దాచి ఉంచిన రూపాయలే దొంగతనానికి గురయ్యాయని ఆఫీస్ సిబ్భంది తెలిపారు. వైసీపీ నేత జూపూడి జాన్సన్ ఫిర్యాదు మేరకు మంగళగిరి అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆఫీస్ లో పని చేసేవారే దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దొంగను తొందరలోనే పట్టుకుంటామని చెప్పారు  సీఐ నరేశ్ కుమార్.

 

Latest Updates