ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది పిల్లలు మృతి

మహారాష్ట్రలో దారుణం జరిగింది. భండారా జిల్లా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది నవజాత శిశువులు మృతిచెందారు. ఆస్పత్రిలోని సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ) వద్ద భారీగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన సమయంలో వార్డులో మొత్తం 17 మంది పిల్లలుండగా.. వారిలో ఏడుగురిని ఆస్పత్రి సిబ్బంది రక్షించారు.

డ్యూటీలో ఉన్న ఒక నర్సు వార్డులో పొగ రావడం గుర్తించింది. వెంటనే ఆస్పత్రి నిర్వహణ అధికారులను అప్రమత్తం చేసింది. ఆస్పత్రి ఫిర్యాదుతో అగ్నిమాపక దళం వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది.

For More News..

పైసలు మిగిలినా కొత్త పెన్షన్లు ఇస్తలే

నాలుగేండ్లలో 5 వేల యాక్సిడెంట్లు

ఈ ఏడాది 20 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు

Latest Updates