ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. క్యాంప్ ఆఫీస్ దగ్గర విధులను నిర్వహిస్తున్న 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. క్యాంపు కార్యాలయం దగ్గర 2వ తేదీన వైద్య, ఆరోగ్యశాఖ టెస్టులు నిర్వహించింది. టెస్టు రిపోర్టులు ఇవాళ(శనివారం) వచ్చాయి. ఈ టెస్టుల్లో 10 మందికి కరోనా సోకినట్టు తేలింది. కరోనా బారిన పడినవారిలో ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన 8 మంది, మరో బెటాలియన్ కు చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు.

Latest Updates