సైకిల్ రిపేర్ చేస్తలేరని..పోలీస్ కంప్లయింట్ ఇచ్చిండు!

సైకిల్ షాపు వాళ్లు మన సైకిల్ రిపేర్ చేయనింకె సతాయిస్తుంటే ఏం చేస్తం? మళ్లీ మళ్లీ తిరుగుతం. లేదంటే సైకిల్ వాపస్ తీసుకుని పోతం. కానీ.. ఓ పిల్లాడు మాత్రం పోలీస్ కంప్లయింట్ ఇచ్చి మరీ.. సైకిల్ రిపేర్ చేయించుకున్నాడు! ఆ పిల్లాడి పేరు ఆబిన్. కేరళలోని కోజికోడ్ జిల్లా మెప్పయ్యూర్ లో ని ఎలింబిలాద్ యూపీ స్కూల్‌‌లో ఐదో తరగతి చదువుతున్నాడు. సెప్టెంబర్ 5న తన సైకిల్‌‌ను  దగ్గర్లోని షాపులో రిపేరింగ్‌‌కు ఇచ్చాడు. రూ. 200 కూడా కట్టిండు. కానీ.. షాపు ఓనర్ ఇప్పుడు, అప్పుడూ అని  చెబుతూ రెండు నెలల నుంచి తిప్పించుకున్నాడు. దీంతో విసిగిపోయిన ఆబిన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు . ‘సర్ నేను, మా తమ్ముడు సైకిల్ రిపేర్‌‌కిచ్చాం. ఇన్నిదినాలైన రిపేర్ చేస్తలేరు. ఎట్లయినా, మా సైకిల్ రిపేర్ చేసిచ్చేలా చూడండి’ అని కోరాడు. పిల్లాడు ఇచ్చిన కంప్లయింట్ చూసి పోలీసులు సర్ ప్రైజ్ అయ్యారు. ఓ లేడీ పోలీస్ ఆఫీసర్‌‌ని పంపారు. ఆమె షాప్‌‌ ఓనర్‌‌తో మాట్లాడింది.  కొడుకు పెండ్లి ఉండటం, తనకు హెల్త్ బాలేకపోవడం వల్ల లేట్ అయిందని సారీ చెప్పిన అతడు వెంటనే సైకిల్ రిపేర్ చేసిచ్చాడు.

Latest Updates