100 మందిని మార్స్ కు తీసుకెళ్లే స్టార్ షిప్

అంగారకుడి పైకి మనుషులను పంపేందుకు స్పేస్‌‌‌‌ ‌‌‌‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌‌‌‌‌‌‌‌ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జపాన్‌ కోటీశ్వరుడు ఓ టికెట్‌ కొని రాకెట్‌ సీట్‌ బుక్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో వంద మందిని మార్స్‌ పైకి మోసుకెళ్లే రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ను ఆయన అందరికీ చూపించారు. ప్రస్తుతం టెక్సాస్‌‌‌‌‌‌‌‌లో తయారవుతున్న దానిని స్టెయిన్‌లెస్‌ ‌‌‌‌‌‌‌స్టీల్‌ సహా కొన్ని లోహాల మిశ్రమంతో తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 150 టన్నుల  పేలోళ్లను మోసుకెళ్లేలా రాకెట్‌ ఇంజన్‌ను తయారు చేస్తున్నామని.. టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌ చేసిన తర్వాత వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో దాని గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates