ఏపీలోని తాడేపల్లి  గోశాలలో  విషాదం: 100 ఆవులు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని  తాడేపల్లి  గోశాలలో  విషాదం చోటు చేసుకుంది. గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో శాలలో ఉదయం లేచి చూసే సరికి దాదాపు 100 ఆవులు మృతి చెందాయి. మరికొన్ని ఆవుల పరిస్థితి విషమంగా ఉండటంతో.. డాక్టర్లతో వైద్యం అందిస్తున్నారు. గోవులు మృతిపై అనుమానాలు ఉండటంతో కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates