కరోనా కంట్రోల్‌కు 100 కోట్లు ..సెక్రటేరియట్‌కి 500 కోట్లా?

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి..లేదంటే దీక్ష చేస్తా: జగ్గా రెడ్డి
హైదరాబాద్‌‌, వెలుగు: జనం కరోనాతో చనిపోతుంటే కేబినెట్ లో సీఎం కేసీఆర్‌ సెక్రటేరియట్‌ గురించి చర్చించడం అన్యాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వైరస్ ను అరికట్టేందుకు రూ. 100 కోట్లు కేటాయించి సెక్రటేరియట్ కు రూ. 500 కోట్లు ఇవ్వట మేంటని గురువారం ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి పేదలకు మెరుగైన ట్రీట్ మెంట్ అందేలా చూడాలని, ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే దీక్ష చేస్తా అని హెచ్చరించారు. కరోనా వస్తే గాంధీలో చేరాతనని మంత్రి తలసాని అంటున్నారని.. ఆయనకు అందించినట్లే సామాన్యులకు ట్రీట్ మెంట్ ఇస్తారా అని అడిగారు.

 

Latest Updates