దళితుడు సీఎంగా ఉంటే 100 శాతం భూపంపిణీ జరిగేది

దళితుడు సీఎంగా ఉంటే 100 శాతం భూపంపిణీ జరిగేది

హుజూరాబాద్ లో TRS ఓడిపోతే 2023లో కూడా అధికారం కోల్పోతామన్న భయంతో కేసీఆర్ కొత్తనాటకానికి తెరలేపారని.. ఇందులో భాగంగానే దళిత బంధు పతకాన్ని ప్రారంభించారన్నారు మందకృష్ణ మాదిగ. దళితులను మరోసారి మోసం చేసేందుకే ఈ దళిత బంధు అని అన్నారు. జూన్ 27న కేసీఆర్ కు ఆకస్మాత్తుగా దళిత సాధికారత గుర్తొచ్చిందన్నారు. తెలంగాణ దళితులను బ్రమల్లో ముంచే ప్రయత్నం కేసీఆర్  చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నమ్మించడంలో.. మోసం చేయడంలో దిట్ట అని అన్నారు మంద కృష్ణ.

2003లో దళితుల స్థితిగతులపై కేసీఆర్ బక్ లెట్ విడుదల చేశారని తెలిపారు మందకృష్ణ మాదిగ. అప్పుడే వాళ్ల స్థితులపై బుక్ లో స్పష్టంగా చెప్పారన్నారు.  ఇప్పుడు కేసీఆర్ కొత్తగా చెప్పేదేముందీ అని ప్రశ్నించారు.కేసీఆర్ ఏడేళ్ల పాలనలో 1శాతం దళితులకు కూడా భూ పంపిణీ జరగలేదన్నారు. దళితుడు సీఎంగా ఉంటే 100 శాతం భూపంపిణీ జరిగేదన్నారు. కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్  సీఎం అయితే ఈ పరిస్థితి వచ్చేదా అని అన్నారు.

కేసీఆర్ పచ్చి మోసగాడన్న మందకృష్ణ.. పదిలక్షలు కాదు పదికోట్ల రూపాయలు సాధించుకోవాలని దళితులకు సూచించారు. త్యాగాలు మనవి... భోగాలు వారివా అని అన్నారు.