కరోనా నుండి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు

ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా నుంచి వందేళ్ల వృద్ధుడు బయటపడ్డాడు. కరోనావైరస్‌ (కొవిడ్‌-19) ధాటికి ఇప్పటికే చైనాలో వేలాది మంది చనిపోయారు. అయితే అదే దేశానికి చెందిన 100 ఏళ్ల వ్యక్తి కరోనాను జయించాడు.

వంద ఏళ్ల ఓ వ్యక్తి కరోనావైరస్‌ లక్షణాలతో ఫిబ్రవరి 24న వుహాన్‌లోని మెటర్నిటీ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌కేర్‌ అస్పత్రిలో చేరారు. ఫ్లూ తరహా లక్షణాలతో పాటు అల్జీమర్స్, బీపీ, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆయనకు కరోనా సోకినట్టు డాక్టర్లు తేల్చారు.13 రోజుల పాటు యాంటీవైరల్‌ ఔషధాలు, ప్లాస్మా విధానం, సంప్రదాయ చైనా ఔషధాలతో ట్రీట్ మెంట్ చేశారు. లేటెస్ట్ గా ఆయన్ను పరీక్షించిన డాక్టర్లు  కరోనా లక్షణాలు  లేవని తెలిపారు.

అతడితోపాటు కోలుకున్న మరో 80 మందిని కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. కరోనా వైరస్ నుంచి బయటపడిన అతి పెద్ద వయస్కుడిగా ఆ వృద్ధుడు రికార్డు సృష్టించాడు.

Latest Updates