102 ఏళ్ల బామ్మ స్కై డైవింగ్: గిన్నిస్ రికార్డ్

స్కై డైవింగ్ చేయాలంటే గుండె ధైర్యం చాలా ఉండాలి.. వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకడమంటే మాములు విషయం కాదు.. వయసులో ఉన్న వారైతే కాస్త డేర్ చేసి ఈ సాహసం చేసేస్తారు. ఇక వయస్సు మీద పడ్డ వారు ఇలాంటి సాహసం చేయాలంటే చాలా ఆలోచిస్తారు. ముసలివారు కాస్త నడవటమే కష్టమనుకుంటే.. సిడ్నీకి చెందిన 102 ఏళ్ల బామ్మ ఏకంగా స్కై డైవింగ్ చేసి గిన్నిస్ రికార్డులోకెక్కింది.

సిడ్నీలో ఉంటున్న 102ఏళ్ల జుంకీ ఇరేన్‌ ఒషియాకు సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆమెకు సాహసాలు చేసే చాన్స్ దొరకలేదు. అయితే 10ఏళ్ల కిందట ఒషియా కూతురు మోటార్‌ న్యూరోన్‌ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. తన కూతురిలా ఎవరూ చనిపోకూడదని.. ఆమె స్కై డైవింగ్ చేసి నిధులు సమకూర్చుతున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బును మోటార్‌ న్యూరోన్‌ డిసీజ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా(ఎంఎన్‌డీఎస్‌ఏ) సంస్థకు ఆమె అందజేస్తున్నారు. ఇందులో భాగంగా 10వేల డాలర్ల నిధులు సమకూర్చడమే లక్ష్యంగా ఈమె సోషల్ మీడియాలో ‘గో ఫండ్ మీ’ అనే పేజీని కూడా ప్రారంభించారు. ఒషియా తన 100వ పుట్టిన రోజున తొలిసారి స్కైడైవింగ్‌ చేశారు. ప్రముఖ ఆస్ట్రేలియన్‌ స్కై డైవర్‌ జెడ్‌ స్మిత్‌ ఆధ్వర్యంలో ఈ బామ్మ రెండేళ్లలో మూడు సార్లు స్కైడైవ్‌ చేశారు. 102 ఏళ్ల వయసులో గత ఆదివారం ఆమె మూడోసారి సుమారు 14,000 అడుగుల ఎత్తు నుంచి  స్కై డైవింగ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates