ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒక్కరోజులో 102 మందికి వైరస్

అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 102 కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,307కు పెరిగిందని అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తనా ఫైల్ అయిన పాజిటివ్ కేసుల్లో 45 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని చెప్పింది. తాజా కేసుల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 14 చొప్పున, కృష్ణా జిల్లాలో 9, కర్పూలు 8, అనంతపురం 4, విజయనగరం 3, విశాఖపట్నం, కడప జిల్లాల్లో రెండు చొప్పున, తూర్పు గోదావరిలో ఒక కేసు నమోదైనట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఎవరూ చనిపోలేదని, వైరస్ నుంచి కోలుకుని 60 మంది డిశ్చార్జి అయినట్లు ప్రకటించింది.

Latest Updates