ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 1528 నామినేషన్లు దాఖలు

ఢిల్లీ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.70 స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు 1,029 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 8న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 1528 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన ఒక్క మంగళవారం రోజే 800 నామినేషన్లు వేశారు. మొత్తం అభ్యర్థుల్లో 187 మంది మహిళలున్నారు. నామినేషన్ల విత్‌డ్రాకు శుక్రవారం వరకు గడువుందని ఢిల్లీ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఢిల్లీలో ప్రధాన పోరు ఆమ్‌ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య జరుగనుంది.

Latest Updates