హత్రాస్ గ్యాంగ్ రేప్ : బాధితురాలికి, ప్రధాన నిందితుడికి మధ్య 104 ఫోన్‌ కాల్స్‌ నిజమేనా..?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ జిల్లా 19ఏళ్ల యువతి గ్యాంగ్ రేప్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  బాలికను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇండియా టుడే కథనం ప్రకారం.. హత్యకేసులో ప్రధాన నిందితుడు సందీప్ సింగ్ కు బాధితురాలికి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ రికార్డ్స్ ఆధారంగా బాధితురాలు సోదరుడు సత్యేంద్ర పేరిట ఉన్న నంబర్ నుంచి  సందీప్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

సత్యేంద్ర నంబర్ 989xxxxx, సందీప్ నంబర్‌ 76186xxxxx ఇదేనని తెలిపిన పోలీసులు.. ఫోన్‌ కాంటాక్ట్‌ 2019 అక్టోబర్ 13 నుంచి  బాధితురాలి గ్రామమైన బూల్‌గారి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోని చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్‌ నుంచి ఎక్కువ కాల్స్‌ వచ్చినట్లు తెలిపారు.

ఈ  రెండు ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్‌ గోయింగ్ కాల్స్, 42 ఇన్‌కమింగ్ కాల్స్ మొత్తం104 కాల్స్‌ ఉన్నాయని రికార్డులు చూపిస్తున్నాయని తెలిపారు. బాధితురాలు, ప్రధాన నిందితులు సన్నిహితంగా ఉన్నట్లు కాల్ రికార్డులు చూపిస్తున్నాయన్నారు యూపీ పోలీసులు.

 

 

Latest Updates