105 మినిట్స్.. కౌంట్​డౌన్​ స్టార్ట్

105 మినిట్స్.. కౌంట్​డౌన్​ స్టార్ట్

హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘105 మినిట్స్’.  బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజు దుస్స దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిన్న ప్రారంభమైంది. ఈ విషయాన్ని హన్సిక సోషల్ మీడియాలో రివీల్ చేసింది. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. ఎలాంటి కట్స్ లేకుండా సింగిల్ షాట్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా మొత్తాన్నీ తీసేస్తున్నారు. అంతేకాదు.. సినిమాలో హన్సిక క్యారెక్టర్ ఒక్కటే కనిపిస్తుంది. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మైల్ స్టోన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిపోయే సినిమా అంటున్నారు మేకర్స్.  టైటిల్‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టే సినిమా 105 నిముషాల నిడివి ఉంటుంది. ఓ ఇంట్లో ఇరుక్కుపోయిన హీరోయిన్‌‌‌‌‌‌‌‌ స్ట్రగులే మెయిన్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. మరోవైపు ‘మహా’ అనే తమిళ క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాభై సినిమాలు పూర్తి చేసింది హన్సిక. ఇటీవల తెలుగులో ‘మై నేమ్ ఈజ్ శృతి’ పేరుతో ఓ సినిమా స్టార్ట్ చేసింది. ఇది కూడా థ్రిల్లర్ మూవీనే. అంటే హన్సిక బ్యాక్ టు బ్యాక్ మూడు థ్రిల్లర్ మూవీస్‌‌‌‌‌‌‌‌లో నటిస్తోందన్నమాట.