108 సిబ్బంది జీతాలు పెంపు

ఆంధ్రప్రదేశ్ లో 108 సిబ్బందికి జీతాలు పెరిగాయి. ప్రజారోగ్య రంగంలో అత్యవసర సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో కేన్సర్ బ్లాక్ ను జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.

108 అంబులెన్స్ డ్రైవర్ల జీతాన్ని ప్రస్తుత రూ. 10 వేల నుంచి సర్వీసును బట్టి రూ. 18 వేల నుంచి రూ. 20 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను ప్రస్తుత రూ.12 వేల నుంచి సర్వీసును బట్టి రూ.20 నుంచి రూ 30 వేలకు పెంచనున్నారు.

Latest Updates