108 డ్రైవర్‌‌ మృతికి వ్యాక్సిన్​ కారణం కాదు

హైదరాబాద్‌‌, వెలుగు:  కరోనా వ్యాక్సిన్‌‌ (కొవిషీల్డ్) తీసుకున్న 108 అంబులెన్స్​ డ్రైవర్​ ఒకరు మరుసటి రోజు చనిపోయారు. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. పబ్లిక్​హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా కుంటాల పీహెచ్‌‌సీ (ప్రైమరీ హెల్త్​ సెంటర్)లో మంగళవారం ఉదయం 108 అంబులెన్స్‌‌ డ్రైవర్‌‌ ‌‌(42) కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. ఆయన ఫ్యామిలీ మెంబర్లు బుధవారం ఉదయం నిర్మల్ జిల్లా హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. అయితే తెల్లారి ఐదున్నరకు ఆయనను హాస్పిటల్‌‌కు తీసుకొచ్చారని, అప్పటికే మరణించి ఉన్నాడని డీహెచ్‌‌ శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ డ్రైవర్​ మరణానికి వ్యాక్సిన్ కారణం కాదని డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారని వెల్లడించారు. ఆదిలాబాద్ రిమ్స్‌‌ నుంచి సీనియర్ డాక్టర్లు నిర్మల్‌‌కు వెళ్లి డ్రైవర్​ డెడ్​బాడీకి పోస్ట్‌‌మార్టం చేశారు. మృతికి హార్ట్​ఎటాక్​ కారణమని వాళ్లు తేల్చినట్టు సమాచారం. మరిన్ని టెస్టుల కోసం బ్లడ్‌‌, ఇతర శాంపిల్స్​ను సేకరించినట్టు తెలిసింది. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌‌ను బుధవారం రాత్రి స్టేట్ హెల్త్ ఆఫీసర్లకు పంపారు. దీన్ని సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌‌ మెంట్‌‌కు పంపనున్నారు.

Latest Updates