ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్ధిని ఆత్మహత్య

10th class student commits suicide in kagaj nagar

కాగజ్‌నగర్‌:  ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు పలు వివాదాలు రేపుతుండగా..   పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ పదవ తరగతి విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది . ఈ ఘటన కాగజ్ నగర్ పట్టణంలోని ఇర్పాన్ నగర్ కాలనీలో జరిగింది.  కాలనీకి చెందిన ఫెర్ధోస్ (15).. అనే విద్యార్ధిని పదవ తరగతి పరీక్షలు సరిగా రాయని కారణంగా, ఫెయిలైతే తల్లిదండ్రులు కోప్పడతారనే భయంతో  ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది.  మంటల వేడి తాళలేక,  తీవ్రగాయాలపాలైన ఆ అమ్మాయి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాగజ్‌నగర్‌ టౌన్ పోలీసులు తెలిపారు.

Latest Updates