ప్రేమ పేరుతో వేధింపులు: పదో తరగతి అమ్మాయి ఆత్మహత్య

10th-class-student-committed-suicide-due-to-love-harassment-in-rangareddy

ప్రేమ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ అమ్మాయి. రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలోని వీరన్నపేట్ గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే అమ్మాయి పదవ తరగతి చదువుతుంది. అదే గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో చాలా సార్లు వేధింపులకు దిగాడు. దీంతో ప్రేమ పేరుతో తనను వేధించకుమని రాజేశ్వరి అతనికి చాలా సార్లు చెప్పింది. అయినా అతనిలో మార్పురాలేదు సరికదా.. మళ్లీ వేధింపులకు పాల్పడడంతో ఆ అమ్మాయి ఉరివేసుకుని చనిపోయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates