తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య

హుజరాబాద్: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై గాజుల మానస(17) అనే విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ ప్రాంతంలో నివసించే గాజుల రవీందర్ కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు పదోతరగతి పరీక్షలు రాస్తున్నది. ఈమెను సోమవారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై ఉదయం నుంచి ముభావంగా ఉంది. సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన తల్లి దండ్రులు తలుపులు పగలగొట్టి .. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమం లోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

 

Latest Updates