పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

10th girls commits suicide for the reason failed in exam

ఖమ్మం : పరీక్షల్లో ఫెయిలైన కారణంగా ఓ పదవ తరగతి విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని పినపాక మండలం బోటి గూడెం గ్రామంలో జరిగింది. మేఘన అనే బాలిక ఎల్చి రెడ్డి పల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసింది. నిన్న వెలువడిన ఫలితాల్లో మాథ్స్ సబ్జెక్టులో ఫెయిలైన కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడింది. బాలిక మృతితో  ఆమె  కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Updates