మరో పది రోజుల్లో టెన్త్ రిజల్ట్స్

లక్ష మందికి 10/10 జీపీఏ!

హైదరాబాద్, వెలుగు: టెన్త్​లో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తుండటంతో ఈసారి10 గ్రేడ్ పాయింట్ యావరేజ్​(జీపీఏ) పొందే స్టూడెంట్ల సంఖ్య భారీగా పెరగనుంది. 2018లో 4,768 మంది 10/10 జీపీఏ రాగా, గతేడాది 8,676  మందికి 10/10 జీపీఏ వచ్చింది. ఈ ఏడాది సుమారు లక్ష మంది స్టూడెంట్లకు 10/10 జీపీఏ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ర్టంలో 5,09,079 రెగ్యులర్ స్టూడెంట్లు పరీక్షలు రాయాల్సి ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసి, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని సూచించింది. దీంతో అందరి దృష్టి గ్రేడ్​పాయింట్లపై పడింది. ప్రైవేటు స్కూళ్ల నుంచే సగానికిపైగా స్టూడెంట్లు ఉన్నారు.  ప్రైవేటు మేనేజ్​మెంట్లు తమ స్కూళ్లలో చదివే ప్రతి విద్యార్థికి ఒక్కో సబ్జెక్టులో 15 నుంచి 20 వరకు ఇంటర్నల్ మార్కులు వేశాయి. మెజార్టీ స్టూడెంట్స్​కు 19, 20 మార్కులు వేసినట్టు తనిఖీలు చేసిన అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన సుమారు లక్ష స్టూడెంట్స్​కు 10 జీపీఏ వచ్చే చాన్స్ ఉంది. ఇది టెన్త్ ఎగ్జామ్స్ చర్రితలో రికార్డుగా మిగిలిపోనుంది.

10 రోజుల్లో రిజల్ట్స్

టెన్త్ ఫలితాలను మరో పది రోజుల్లో ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం స్టూడెంట్ల ఇంటర్నల్ మార్కుల లెక్కలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, ఇతర వివరాలను మరోసారి పరిశీలిస్తున్నారు. ఇంటర్నల్ మార్కులతో జీపీఏ తీయడం సులభమే అయినా, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఫలితాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి, ఎలాంటి తప్పుల్లేవని భావించాకే రిజల్ట్స్​ఇవ్వనున్నట్టు అధికారులు చెప్తున్నారు. గతంలో ఇచ్చిన టెన్త్ మెమోల మాదిరిగానే ఈసారి మెమోలు ఉంటాయని, ఎలాంటి మార్కులు చేయబోమని చెబుతున్నారు.

గైడ్​లైన్స్​ ప్రిపేర్ అవుతున్నయ్

ఇంటర్నల్ మార్కుల ఆధారంగా స్టూడెంట్లను ప్రమోట్ చేసేందుకు విద్యాశాఖ గైడ్​లైన్స్ తయారుచేస్తోంది. దీనికోసం న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్​తోనూ అధికారులు చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్​లో ఎలాంటి న్యాయసమస్యలు రాకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో టెన్త్ ప్రమోట్ కు సంబంధించిన గైడ్ లైన్స్​ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

For More News..

ఆఫీసులు ఓపెన్.. పనులు క్లోజ్

మరో మల్టీస్టారర్?

సన్‌‌రైజర్స్‌‌ ఆటగాళ్లు సారీ చెప్పాలి

Latest Updates