రాగి పాత్రల్లో నీళ్లను తాగొచ్చా?

భూమి పై మనుగడ సాగించాలంటే నీళ్లు తాగాల్సిందే. మానవ దేహంలో 70 శాతం నీళ్లతోనే నిండి ఉంటుంది. నీళ్ల ప్రాముఖ్యతను మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు. అందుకే నీళ్లను రాగి పాత్రల్లో నిల్వ ఉంచి తాగేవారు. నీళ్లను సురక్షితంగా ఉంచడానికే వాళ్లు దాని పాటించి ఉండొచ్చు, కానీ దీని వెనుక తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి.

ఈ రోజుల్లో నీళ్లను శుద్ధి చేయడానికి, నిల్వ ఉంచడానికి ఇళ్లల్లో యూవీ ఫిల్టర్లు, ఆర్వో ప్యూరిఫైయర్స్‌‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో మెటల్ కంటెయినర్లలో వాటర్‌‌ను నిల్వ ఉంచడం ఇప్పటి జనాలకు పాత విషయంగా అనిపించొచ్చు. కానీ ఆయుర్వేద లాంటి పురాతన వైద్య విధానాలను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాగి పాత్రల్లో నీళ్లను నిల్వ చేయడం, తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగి సృష్టించే సాధారణ ప్యూరిఫికేషన్ ప్రక్రియ ద్వారా నీళ్లలో ఉన్న సూక్ష్మజీవులు, శిలీంధ్రాలతోపాటు హానికర బ్యాక్టీరియా చనిపోతాయి. రాగి పాత్రల్లో నీళ్లను కనీసం నాలుగు గంటలపాటు నిల్వ ఉంచాలి. అప్పుడు రాగి గుణాన్ని తీసుకుంటుంది. నీళ్లను రాగి పాత్రల్లో నిల్వ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

కడుపులో మంటకు కారణమయ్యే హానికర బ్యాక్టీరియాను రాగిలోని గుణాలు చంపేస్తాయి. అల్సర్, అజీర్ణం, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు రాగిలోని లక్షణాలు తోడ్పడతాయి. మూత్రపిండాలు, కాలేయం పని చేసేతీరును రాగి మెరుగుపరుస్తుంది. వాటిలో ఉండే మలినాలను తొలగించి, భోజనంలోని న్యూట్రిషన్లను తీసుకునేందుకు సాయపడుతుంది.

 రాగి పాత్రల్లోని నీళ్లను తరచూ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు. శరీరంలోని కొవ్వులను తొలగించడంలో రాగి ఉపయోగపడుతుంది.

గాయాలను మాన్పడంలోనూ రాగిలోని లక్షణాలు బాగా పని చేస్తాయి. శరీరంలో కొత్త కణాలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ రాగి తోడ్పడుతుంది.

గుండె నొప్పులు రాకుండా రాగి అడ్డుకుంటుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. రక్త ప్రసరణతోపాటు గుండె కొట్టుకునే వేగాన్ని రాగిలోని గుణాలు నియంత్రిస్తాయి.

రాగిలో ఉండే యాంటీయాక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు సాయపడతాయి. మరో రోగమైన థైరాయిడ్ రోగుల్లో ఉండే ముఖ్యమైన లక్షణం వారి శరీరంలో కాపర్ లెవల్స్ తక్కువగా ఉండటం. వీళ్లు రాగి పాత్రల్లో నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.

కళ్లు, జుట్టుతోపాటు చర్మం రంగును మార్చివేసే మెలానిన్‌‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాగికి ఉంది. చర్మం మరింత మృదువుగా ఉండేందుకు రాగి తోడ్పడుతుంది.

Latest Updates