అత్తకు గుడి కట్టి పూజలు, భజనలు చేస్తున్న కోడళ్లు

అత్తా కోడళ్ల రిలేషన్ గురించి చెప్పాలంటే.. అత్తలేని కోడలు ఉత్తమరాలు..కోడలు లేని అత్త గుణవంతు రాలు..అన్న సామెతను  చెప్పుకుంటారు. అత్తా కోడళ్ల మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో సామెతను బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ  ఛత్తీస్‌గడ్  ‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఓ అత్తకు 11 మంది కోడళ్లు గుడి కట్టి..పూజలు, భజనలు చేస్తూ అత్తా కోడళ్ల మధ్య ఉన్న రిలేషన్ కు కొత్త నిర్వచనం చెప్పారు. అత్త అంటేనే గయ్యాలీ అనుకునే ఈ రోజుల్లో అత్తా కోడళ్ల రిలేషన్ గురించి అందరికి చాటి చెబుతున్నారు.

బిలాస్ పూర్ లోని రతన్‌పూర్ గ్రామంలో రిటైర్డ్ టీచర్ శివప్రసాద్, గీతాదేవి తంబోలికి  ఉమ్మడి కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో మొత్తం 39 మంది  ఉన్నారు, ఇందులో 11 మంది కోడళ్లు ఉన్నారు. గీతా దేవి 2010 లో మరణించారు. ఆమె బ్రతికి ఉన్నప్పుడు  ఆమె తన కోడళ్లను ప్రేమగా తన కూతుళ్ల లాగ  వారిని చూసుకునేదని.. వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేదని స్థానికులు చెబుతున్నారు.

బిలాస్‌పూర్ జిల్లా కేంద్రం నుంచి  25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాస్‌పూర్-కోర్బా రహదారి పక్కన  11 మంది కోడళ్లు  2010 లో మహాదేవి ఆలయం నిర్మించారు. ఈ ఆలయం వాళ్ల అత్త గీతా దేవికి గుర్తుగా నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహాన్ని బంగారు ఆభరణాలతో అలంకరించారు. రోజూ పూజిస్తారు. కోడళ్లు అందరూ  నెలకు ఒకసారి వచ్చి ఆలయం ముందు భజన-కీర్తనలు చేస్తారు.  గీతదేవి  ఆమె కుటుంబ ఐక్యతను గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలు ఉదాహరణగా చెబుతున్నారు. ప్రస్తుతం కాలంలో అత్తగారిపై అలాంటి ప్రేమ మరెక్కడా కనిపించదంటున్నారు.

see more news

కాళేశ్వరంలో భారీ అవినీతి.. కొన్నది 1686 కోట్లు..లెక్కల్లో చూపించింది 7348 కోట్లు

‘పోలీసులు కండువా లేని టీఆర్ఎస్ నాయకులు‘

భారత్ సంచలన విజయం.. కంగారూలను చితగ్గొట్టిన పంత్, గిల్

కోడాలి నాని vs దేవినేని ఉమా.. తిట్ల పురాణం

 

Latest Updates