24 గంటల్లోనే 11లక్షల మంది ఆప్‌లో చేరిన్రు

మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ… ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రికార్డులు బ్రేక్ చేస్తోంది. కేవలం 24 గంటల సమయంలోనే దేశ వ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా ప్రజలు ఆప్ లో చేరారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  మరుసటి రోజు ఆమ్‌ ఆద్మీ తమ పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ నంబర్‌కు మిస్స్ డ్ కాల్ ఇవ్వండి… పార్టీలో చేరండి అంటూ ఆ పార్టీ ఇచ్చిన పిలుపుతో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. 24 గంటల్లో ఏకంగా 11 లక్షల మందికి పైగా ప్రజలు ఆప్ లో చేరారు. ఈ విషయాన్ని ఆప్ తన ట్విట్టర్ ట్వీట్ చేసింది.

మరోవైపు ప్రజల నుంచి ఇంత భారీ ఎత్తున స్పందన లభించడం చరిత్రాత్మకమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates