జోధ్ పూర్ లో ఒకే ఫ్యామిలీలో 11మంది సూసైడ్?

  • అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు
  •  రాజస్థాన్‌‌లోని జోధ్ పూర్ లో ఘటన

రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఒ కే ఫ్యామిలీకి చెందిన 11 మంది మృతి చెందడం కలకలం రేపింది. పాకిస్తాన్ కు చెందిన హిందూ మైగ్రెంట్స్ ఫ్యామిలీ డెచు ఏరియాలోని లోద్ టా గ్రామానికి వలస వచ్చింది. వీరు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. అక్కడే గుడిసె వేసుకొని నివసిస్తున్నారు. ఫ్యామిలీలోని 11 మంది ఆదివారం ఉదయం మృతి చెంది కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు వచ్చి పరిశీలించారు. గుడిసె బయట ఫ్యామిలీకి చెందిన ఒకతను ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. ‘‘వీరందరూ ఎలా చనిపోయారు?, ఈ ఘటనకు కారణాలు ఏంటనేది ఇంకా తేలలేదు. అయితే ఫ్యామిలీలోని అందరూ కలిసి సూసైడ్ చేసుకున్నట్లుగా భావిస్తున్నాం. గుడిసె ప్రాంతంలో కెమికల్ స్మెల్ కూడా వస్తోంది. వాళ్లుఏదైనా కెమికల్ తాగి, ఆత్మహత్య చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నాం” అని ఎస్పీ రాహుల్ భరత్ తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగి ఉంటుందన్నారు. డెడ్ బాడీలపై ఎలాంటి గాయాలు గానీ, మరకలు గానీ లేవనిచెప్పారు. ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను రప్పించామన్నారు. ప్రస్తుతమున్న సమాచారాన్ని బట్టి ఏదో విషయంలో ఫ్యామిలీలో గొడవ జరిగి ఉంటుందని భావిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. ‘‘బతికున్న వ్యక్తి ఈ ఇన్సిడెంట్ గురించి ఏమీ తెలియదని చెప్పాడు. అతణ్నివిచారిస్తేనే అసలు విషయం తెలుస్తుంది” అని ఎస్పీ చెప్పారు.

Latest Updates