11 మందికి నెగిటివ్ : 70కి చేరిన పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 70కి చేరాయ‌ని తెలిపారు సీఎం కేసీఆర్. అందులో 11 మంది బాధితుల‌కి నెగిటివ్ రిపోర్ట్ వ‌చ్చింద‌న్నారు. ఫార్మాలిటీస్ పూర్తికాగానే వారిని డిశ్చార్జ్ చేస్తామ‌ని చెప్పారు. ఏప్రిల్ 7 నాటికి క‌రోనా ఫ్రీ తెలంగాణ కావాల‌న్నారు.

లాక్ డౌన్ ఆయుధాన్ని స‌రిగ్గా పాటించామ‌ని.. లేక‌పోతే ప‌రిస్థితి దారుణంగా ఉండేద‌ని చెప్పారు. హోం క్వారంటైన్ లో ఉన్న‌వారిని రోజుకి రెండు సార్లు డాక్ట‌ర్లు ప‌రిశీలిస్తున్నార‌ని.. కొత్త కేసులు లేక‌పోతే అబ్జ‌ర్వేష‌న్ లో ఉన్న అనుమానితుల సంఖ్య జీరో కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారుసీఎం కేసీఆర్.

Latest Updates