జార్ఖండ్ లో పోలీసులపై మావోయిస్టుల బాంబు దాడి

జార్ఖండ్ లోని సిరాయికెల్లాలో ఉదయం 5 గంటల సమయంలో IED పేలుడు జరిగింది. జార్ఖండ్ పోలీసులు, కోబ్రా టీం స్పెషల్ ఆపరేషన్స్ కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందులో 8 మంది కోబ్రా దళానికి చెందిన జవాన్లు సహా, మరో ముగ్గురు జార్ఖండ్ పోలీసులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది… పేలుడు జరిగిన ప్రాంతానికి హెలికాప్టర్ పంపించారు. గాయపడ్డ 11 మంది భద్రతా సిబ్బందిని మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు.

మరోవైపు సరాయికెల్లా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలు కూంబింగే చేపడుతున్నాయి. గాయపడ్డ జవాన్లు, పోలీసులను రాంచీ హాస్పిటల్ లో జార్ఖండ్ డీజీపీ డీకే పాండే పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎన్నికలను అడ్డుకునేందుకు మావోయిస్టులు ఈ ఐఈడీ పెట్టారు. అయితే వాటిని క్లియర్ చేసే సమయంలో మావోయిస్టులు బాంబును పేల్చారని చెప్పారు డీజీపీ

Latest Updates