మత్స్యకారులకు చిక్కిన 1150 కిలోల చేప

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నానికి చెందిన మత్స్యకారులకు స‌ముద్రంలో భారీ చేప ల‌భ్య‌మైంది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన వారి‌కి అదృష్టం చేప‌ రూపంలో వలకు చిక్కింది. వ‌ల‌లో ఏకంగా 1,150 కిలోల బరువున్న టేకు చేప ప‌డింది.వలలు తెగిపోతాయన్న కారణంతో ఆ చేపను ఎంతో జాగ్రత్తగా తీరం వరకు తీసుకొచ్చి, ఆపై క్రేన్ సాయంతో ఒడ్డుపైకి చేర్చారు. . చుట్టుపక్కల ప్రజలు ఈ భారీ చేపను చూసేందుకు ఆసక్తి చూపారు. రూ. 37 వేలకు ఆ చేప‌ను విక్ర‌యించిన‌ట్టు మత్స్యకారులు తెలిపారు. ఇలాంటి టేకు చేప‌లు అరుదుగా జాల‌ర్ల‌కు చిక్కుతాయ‌ని మ‌త్స్య‌శాఖ అభివృద్ధి అధికారి ర‌మ‌ణ తెలిపారు.

Latest Updates