పాము కాటేసింది.. ఆర్మీ కాపాడింది

జమ్ము కశ్మీర్ లో సైన్యం ఓ చిన్నారి ప్రాణం కాపాడింది. పాము కాటేయడంతో కొన ప్రాణంతో ఉన్న చిన్నారికి ఆర్మీ హాస్పిటల్ మళ్లీ బతుకునిచ్చింది. 11 ఏళ్ల చిన్నారి యస్మీనాను పాము కరిచింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే విషం ప్రభావంతో పాప స్పృహ కోల్పోయింది. ప్రాణాలు పోయాయనే అనుకున్నారంతా. ఐతే.. ఆర్మీ హాస్పిటల్ డాక్టర్లు.. చిన్నారికి ట్రీట్ మెంట్ అందించారు. శరీరంలో విష ప్రభావం తగ్గించారు. ప్రాణాపాయం నుంచి తప్పించారు. మరో మూడురోజులపాటు చికిత్స అందించింది.. యస్మీనాను ఇంటికి పంపిస్తామని ఆర్మీ హాస్పిటల్ అధికారులు చెప్పారు.

చిన్నారి యస్మీనాకు అందిన చికిత్స వివరాలను శ్రీనగర్ ఆర్మీ హాస్పిటల్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ బీసీ నంబియార్ తెలిపారు. ఆరోగ్యంగా విషమంగా ఉన్న పరిస్థితిలో యస్మీనాను హాస్పిటల్ కు తీసుకొచ్చారని.. ప్రాపర్ ట్రీట్ మెంటే ఆమెను బతికించిందని చెప్పారు.

Latest Updates