12 ఏళ్ల కవలల హత్య : చంపింది మేనమామే

twins0616కంటికి రెప్పలా చూసుకోవాల్సిన మేనమామ కనికరం లేకుండా ప్రవర్తించాడు. స్వయాన అక్క బిడ్డలైన కవలలను దారుణంగా చంపాడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ దారుణమైన సంఘటన హైదరాబాద్ లోని చైతన్యపురిలో చోటుచేసుకుంది. ఇద్దరు మానసిక వికలాంగులైన కవల చిన్నారులను మేనమామే హతమార్చాడు.

చిన్నారులను చంపి కారులో తరలిస్తుండగా ఇంటి యజమాని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సహకారంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మృతిచెందిన కవలలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సృజనరెడ్డి(12), విష్ణువర్దన్‌ రెడ్డి(12). మిర్యాలగూడకి చెందిన శ్రీనివాస్ రెడ్డి , లక్ష్మీ దంపతులకు మానసిక, అంగవైకల్యంతో ఇద్దరు కవల పిల్లలు( పాప, బాబు) జన్మించారు. వీరి ఆరోగ్య పరిస్థితి బాగలేక తన అక్క పడుతున్న బాధలు, ఆర్థిక సమస్యలు చూడలేక చైతన్యపురి లిమిట్స్ సత్యనారాయణ పురంలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్న మల్లికార్జున్ రెడ్డి (35)  పథకం వేశాడు.

మిర్యాలగూడెం నుండి హైదరాబాద్ కి తీసుకవచ్చాడు. తన రూమ్ మెంట్ అయిన వెంకట్రామిరెడ్డి సహాయంతో ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. వీరి ఆరోగ్యం బాగాలేదని తనకు తెలిసిన కారును పిలిపించుకుని కారులో తరలిస్తున్న సమయంలో శబ్దం విన్న ఇంటి యజమాని మహేష్ రెడ్డి అడ్డుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించగా , కేసు నమోదు చేసుకుని నిందితుడు(మేనమామ) మల్లికార్జున్ రెడ్డి , కారు డ్రైవర్ వివేక్ రెడ్డి , రూమ్ మెంట్ వెంకట్రామిరెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు . మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

 

Posted in Uncategorized

Latest Updates