12 మృతదేహాలు లభ్యం..ఇంకా కొనసాగుతున్న గాలింపు చర్యలు

boatఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం కన్నీటి సంద్రమైంది. పడవ ప్రమాదంతో గోదారి తీరం విషాదంగా మారింది. దేవీపట్నం మండలం మంటూరు… పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య పడవ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మృతదేహాలు బయటకు తీశారు. ఇందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. మిగతా వారికోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు ప్రమాదానికి గురైన పడవను 60 అడుగుల లోతు నుంచి బయటకు తీశారు. నదిలో ఇసుకలో కూరుకుపోయిన పడవను బయటకు తీసేందుకు NDRF, నేవీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. పడవలో 8 మృతదేహాలను గుర్తించారు. పడవకు తాళ్లు కట్టి భారీ క్రేన్ల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పరిశీలించారు.

మంగళవారం(మే-15) 50 మంది  ప్రయాణికులతో వెళ్తున్న పడవ భారీ వర్షం, గాలుల ధాటికి గోదావరిలో మునిగింది. ప్రమాదంలో 30 మందికి పైగా గల్లంతయ్యారు. NDRF  బృందాలు, నేవీ సిబ్బంది రాత్రి నుంచి గాలింపు చేస్తున్నారు. పడవ నదిలో 60 అడుగుల లోతులో ఉన్నట్టు ఉదయం గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates